9 May, 2026 | 1:41 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు

09-05-2026 12:40 PM

విశ్రాంత ఐపీఎస్ భార్య హత్య కేసులో విచారణ వేగవంతం

నిందితులు తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఎక్కి పరార్

హైదరాబాద్: జూబ్లీ హిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ రే(Retired IPS Vinay Ranjan Ray) భార్య హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్య తర్వాత నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్ లో తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఎక్కి పరారైనట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ముంబయి, లక్నో, ఢిల్లీ నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఇప్పటికే నేపాల్ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నారు.

గతంలో లక్నోలో కల్పన పనిచేసిన ఇంటికి వెళ్లిన పోలీసులు విచారించారు. కల్పనతో పాటు ఉన్న ఇద్దరు యువకులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. పనిమనిషి కల్పన గత చరిత్ర ను పోలీసులు తెలుసుకుంటున్నారు. నగరంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటన నేపథ్యంలో ఇళ్ల కోసం నేపాలీ జాతీయులను పనికి నియమించుకునేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.