9 May, 2026 | 2:16 PM

Breaking News

మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •  

ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి

09-05-2026 12:42 PM

వర్కర్ల నియామకంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం 

ఎస్పీ నితికా పంత్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో ఇంటి యజమానులు తమ ఇళ్లలో పనిచేసే వంటమనుషులు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, సహాయకులు తదితరుల పూర్తి వివరాలను తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. అద్దె గదులు ఇచ్చే యజమానులు కూడా అద్దెదారుల వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేసి వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు.

భద్రతా పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇంటి పనుల కోసం నియమించుకునే వ్యక్తుల ఆధార్ కార్డు, ఫోటో, మొబైల్ నంబర్, ప్రస్తుత చిరునామా వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా అనుమానాస్పద ఘటనలను నివారించవచ్చని  పేర్కొన్నారు.  ఉద్యోగాల్లో నియమించుకునే సందర్భాల్లో వ్యక్తుల  పూర్తి ధృవీకరణ అనంతరమే పనిలోకి తీసుకోవాలని సూచించారు.

ఇంటి యజమానులు ముందస్తుగా వివరాలు నమోదు చేయిస్తే ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని, ప్రజలకు మరింత సురక్షిత వాతావరణం కల్పించవచ్చని  తెలిపారు. జిల్లా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు.