9 May, 2026 | 3:26 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి

09-05-2026 02:13 PM

దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మార్కెట్ యార్డ్ లో శుక్రవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిచిపోవడంతో  అశ్వారావుపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబళ్ల రవి మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా తంబళ్ళ రవి మాట్లాడుతూ యార్డ్ కి ధాన్యం వచ్చి నెల కావస్తున్న కొనే దిక్కు లేదనీ, లారీలు లేవు అనే సాకుతో ఎన్ని రోజులు కాలం గడుపుతారనీ, ధాన్యం కొనుగోలు వెంటనే మొదలు పెట్టాలనీ , రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదనీ హెచ్చరించారు.

రైతులు పంట పండించి, పంట అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందనీ, గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎందుకు ఏడిపిస్తున్నదనీ, ధాన్యం ఎంతకాలం యార్డ్ లలో ఉంచుకుంటారనీ, తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలనీ, తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రైతులకు  ఎలాంటి ఇబ్బంది లేకుండ వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దొడ్డా సతీష్, ఎస్ సి మోర్చా మండల అధ్యక్షులు సొరకాయల సీతారాముల రైతులు పాల్గొన్నారు.