9 May, 2026 | 3:35 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

అవినీతి, అక్రమాలకు అడ్డాగా కాంగ్రెస్

09-02-2026 12:00 AM

బీజేపీ రాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ ఇంచార్జి అభయ్ పటేల్

మంచిర్యాల, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడి అవినీతికి అడ్డగా మారిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ ఇంచార్జి అభయ్ పటేల్ అన్నారు. ఆదివారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలోనే కాకుండా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా అవినీతి అక్రమాలకు అడ్డగా మారి, గుండాయిజానికి అడ్డు అదుపు లేకుండా పోవడంతో ఇక్కడ ఎన్నో రకాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి వికసిత్ మంచిర్యాల బిజెపి సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, మాజీ ఎంపీ వెంకటేష్ నేత, జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, తుల ఆంజనేయులు, అమీర్ శెట్టి రాజు, రంగ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.