calender_icon.png 5 February, 2026 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రగులుతున్న అసంతృప్తుల జ్వాల

05-02-2026 12:04:06 AM

  1. అధికార పార్టీలో అక్రమార్కులకే అందలం
  2. పార్టీ జెండా మోసిన నేతలకు మొండి చెయ్యి..
  3. ఉదృత రూపంలోకి ప్రధాన పార్టీల ప్రచారం. వెనకబడ్డ ఖమలం, నిశ్శబ్ద విప్లవంగా స్వతంత్రుల ప్రచారం
  4. పాత మొకాలతో ప్రజల నుండి ఎదురవుతున్న చీత్కారాలు

నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 4 ( విజయక్రాంతి )మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊ పందుకున్న కొద్దీ నాగర్ కర్నూల్ పట్టణం లో మైకుల మోత జన సమూహాలు, రంగురంగుల జెండాలు వాడవాడలా ఎగిరిపోతు న్నాయి. కానీ ఈ హడావుడి వెనక పార్టీ టి క్కెట్ కోసం ఆశించిన అభ్యర్థులు, వారి కేడ ర్, అభివృద్ధిని ఆశించిన ప్రజల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి రగులుతోంది. ప్రచార శ బ్దం ఎంత గట్టిగా ఉన్నా గత ఎన్నికల్లో ఓటర్లకు ఇచ్చిన హామీలు అమలు, అక్రమాలు వంటి వాటి ప్రశ్నలు కూడా అంతే గట్టిగా పోటీదారులను  వెంటాడుతున్నాయి.

గత బిఆర్‌ఎస్ పార్టీలో గెలుపొందిన మాజీ కౌ న్సిలర్లకే మళ్ళీ అధికార పార్టీలో టికెట్లు దక్కడంతో కేవలం జెండాలు, వాటి రంగులు మారాయి కానీ పాత మోకాలే దర్శనం ఇ స్తుండడంతో  ఓటర్ల నుండి చీత్కారాలు త ప్పడం లేదు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ అండతో ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు, నాళాలు కబ్జా చేసి వేల కోట్ల ధనం పోగు చేశారని ప్ర చారంలో ఉంది.

అధికారం మారిన వెంటనే వాటి మనుగడ కోసం మళ్ళీ తమ రంగు మార్చి ప్రస్తుతం అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టారని విమర్శలు ఉ న్నాయి. ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నదంటూ ఓటర్లకు డబ్బులు ఇచ్చి కొనగలిగే వ్యక్తులకే టికెట్లు వరించాయని కూడా చర్చ జరితోంది. ప్రజాసేవకై పనిచేసే నిక్సాన కాం గ్రెస్ కార్యకర్తలకు మొండి చేయి చూపి అదే అవినీతిపరులు భూ దంధాలు, సెటిల్మెంట్ల కు పాల్పడిన వ్యక్తులకే టికెట్లు ఇవ్వడంతో ప్రస్తుతం టికెట్లు ఆశించిన నేతల్లో, అధికార ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల్లో ప్రజల్లో తీవ్ర అ సంతృప్తి జ్వాల రగులుతోందని ప్రచారం జరుగుతోంది.

కొంతమంది ఆయా పార్టీ స భ్యత్వాలకు రాజీనామా చేస్తుండగా మరి కొంతమంది సైలెంట్ మూడ్లోకి వెళ్లిపోయా రు. మరి కొంతమంది టికెట్ ఆశించి భంగపడ్డ వారు తమ సత్తా ఏంటో నిరూపించు కుంటామని బరిలో నిలిచారు. అత్యధికంగా జనరల్ స్థానాల్లోనే స్వతంత్రులు ఎక్కువగా పోటీలో ఉండగా ఎవరి ఓట్లు చీల్తాయోనన్న భయం వెంటడుతోంది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అహంకారం అక్రమాలు, అవినీతి వల్లే ఓటమి చవిచూసిందని ప్రస్తుతం ఆ ఓటమికి కారణమైన ముఖ్య నేతలే ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఓటర్లలో అసంతృప్తి నెలకొందని వాదన వినిపిస్తోంది.

పార్టీ కోసం ఏళ్ల తరబడి జెండా మోసిన నిబద్ధత గల నేతలకు మాత్రం మొండి చెయ్యి చూపడంపై కేడర్ అంతా మండిపడుతోంది. అక్రమార్కులు ఎంట్రీ ఇవ్వడంతోనే నిజాయితీగల అధికార పార్టీ నేతలకు సైతం అవినీతి మరకలు అం టుతున్నాయని చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నామన్న అహంకారమే ఈ నిర్ణ యాలకు కారణమన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో ఓటమి భయంతో ప్రతిపక్ష పార్టీలోని అభ్యర్థులను తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారంటూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నాగర్ కర్నూల్ ము న్సిపాలిటీలోని 24 వార్డులకు గాను ఆరు స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తుంది. అదే స్ఫూర్తి తో ప్రచారంలోనూ  ప్రధాన పార్టీల కంటే తక్కువేమి కాదంటున్నారు.

చివరికి ఆయా వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇం టింటి ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి. అయితే ఈ హడావుడిలో ఖమలం పా ర్టీ మాత్రం వెనకబడిపోతోంది. ఎక్కడో ఉనికిని చాటుకునే ప్రయత్నాలు కనిపిస్తున్నా, జనాల్లో పట్టింపు మాత్రం కరవవుతోంది. 

కాగా పాత మొకాలతో మరోసారి ప్రజల ముందుకు వచ్చిన పాత నేతలకు మాత్రం ఎదురుదెబ్బలు తప్పడం లేదు. అభివృద్ధి మాటలు, హామీల జాబితాలు వినడానికి ఓటర్లు సిద్ధంగా లేరన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రచారానికి వచ్చిన అభ్యర్థులకు బహిరంగంగానే చీ త్కారాలు ఎదురవుతున్నాయి. ఎన్నికలప్పుడే గుర్తొస్తామా? అన్న ప్రశ్నలు నాయకుల గుండెల్ని పిండేస్తున్నాయి.ప్రచారంలో గంభీరత కంటే గందరగోళమే ఎక్కువగా కనిపి స్తోంది. ప్రజా సమస్యలపై స్పష్టమైన దృక్ప థం లేకుండా, కేవలం అధికార బలంతోనే గెలవాలన్న ధోరణి పార్టీలను కమ్ముకుంటోంది. 

ఇదే కొనసాగితే ఈసారి మున్సిపాలి టీ ఎన్నికలు అనేక రాజకీయ లెక్కలను తలకిందులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రచార మైకులు ఎంత గట్టిగా మోగినా, ఓటరు మనసులో మాత్రం నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. ఆ విప్లవం పోలింగ్ రోజున ఏ రూపం దాల్చుతుందో చూడాల్సిందే.