15 June, 2026 | 6:10 PM

Breaking News

పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •   యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం   •  

గడ్డపోతారంలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే

09-01-2026 12:00 AM
  1. చైర్మన్ పీఠం కైవసం లక్ష్యంగా ముందుకు వెళ్దాం
  2. కాంగ్రెస్ నాయకులు రాజు గౌడ్, మంత్రి అశోక్

జిన్నారం/అమీన్ పూర్, జనవరి 8: గడ్డపోతారం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషించాలని, పార్టీ అభ్యర్థుల గెలుపు, చైర్మన్ పీఠం కైవసమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు సాగాలని పార్టీ నాయకులు రాజు గౌడ్, మంత్రి అశోక్ పిలుపునిచ్చారు. గురువారం విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణ, మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తల పాత్ర, బూత్ లెవల్ నుండి పార్టీ బలోపేతం, తదితర అంశాలపై చర్చించారు.

ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలను సైతం ప్రజలకు వివరించాలని తెలిపారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. కమిటీల సమన్వయంతో క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ నుండి  కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గడ్డపోతారం మున్సిపల్ కార్యాచరణ సిద్ధం చేసి, ప్రణాళికతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మహిళ సాధికారత దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంకు అండగా నిలిచి, మున్సిపల్ ఎన్నికల్లో ఓటు రూపంగా ప్రజలు తమ మద్దతును తెలియజేయాలని పిలుపునిచ్చారు.