calender_icon.png 19 February, 2026 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ముగిసిన ఉత్సవాలు

19-02-2026 12:00:00 AM

  1. పాల్గొన్న ఎమ్మెల్యే, కౌన్సిలర్లు
  2. మొక్కులు తీర్చుకున్న లక్షల మంది భక్తులు

బిచ్కుంద, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో గల బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాచీన సద్గురు బస్వలింగప్ప స్వామి మఠం శివభక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారంగా మారి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచింది. మూడు రోజులు కొనసాగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు వస్తున్నారు.

అంగరంగ వైభవంగా  ఉత్సవాలకు మఠం వెళ్తే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి స్టేజ్ను కైలాస పర్వతంగా అలంకరిం చారు. మఠం పీఠాధిపతిసోమలింగ శివాచార్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం, మహారుద్రా భిషేకం, రథోత్సవం, లింగదీక్ష పూజలు, అన్నదానం చేపట్టారు. మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి.

968లో సంస్థాన్ స్థాపన..

దక్షిణ కాశీగా పిలువబడే సద్గురు బస్వలింగప్ప స్వామి మఠం సంస్థాన్, శివాలయానికి పెద్ద చరిత్ర ఉంది. 968వ సంవత్సరంలో ఈ మఠం కొలువుదీరింది. నేటికి 1,058 ఏళ్ల చరిత్ర ఉంది. దక్షిణ కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిం చారు. ఆనాడు సంస్థాన్ పీఠానికి మూల పురుషుడు గురులింగప్ప పట్టాచార్యమూర్తి 968వ సంవత్సరం ప్రథమ ఫీఠాధిపతిగా ఉన్నారు.

రెండో పీఠాధిపతి వీర బస్వయ్యప్ప పట్టాచార్యమూర్తి.  ఇప్పుడు 30వ పీఠాధిపతిగా సోమలింగ శివాచార్య స్వామి కొనసాగుతున్నారు. బిచ్కుంద, బాన్సు వాడ బోర్లం గుట్ట శివాలయం, నారాయణ్ ఖేడ్ బోరంచ గ్రామంలో నల్లపోచమ్మ దేవాలయం, సికింద్రాబాద్లో శంకర్ మఠం, శివాలయ దేవస్థా నాలు వెయ్యి ఏళ్ల నుంచి బిచ్కుంద మఠమ్ సంస్థాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

మహా రథోత్సవం..

 మూడు రోజుల పాటు అంగరంగా వైభవంగా జాతర ఉత్సవాలు కొనసాగాయి. మొదటి రోజు శివ పార్వతుల కల్యాణ మహోత్సవం, రుద్రాభిషేకం, భక్తి సాంస్కృతిక, దీక్ష కార్యక్రమాలు అంగరంగ వైభవంగా రథోత్సవం, అన్నదానం, దీపాల అలంకరణ, లక్ష బిల్వార్చన, కుస్తీపోటీలు, తీర్ధ ప్రసాదాలతో ఉత్సవాల ముగింపు కొనసాగించారు.

శ్రీశ్రీశ్రీ కాశీవిశ్వనాథ స్వామి దేవాస్థానం.జుక్కల్, బాన్సువాడ నియోజక వర్గాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి లక్షల మంది భక్తులు బిచ్కుంద మఠం సంస్థాన్, శివాలయ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. చివరి రోజున జుక్కల్  ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో పాటు నూతనంగా ఎన్నికైన కొంతమంది కౌన్సిలర్లు కూడా పాల్గొన్నారు. 

గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం

అంగరంగా వైభవంగా మూడు రోజులు మఠంలో మహా శివరాత్రి, జాతర ఉత్సవాలు 1,054 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. ఈ మఠం స్థాపన జరిగి వెయ్యేళ్లు అయినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తు న్నాయి. 30వ పీఠాధిపతిగా సోమలింగ శివ చార్యులు కొనసాగు తున్నారు. ఈ మఠం అత్యంత పవిత్రంగా గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది. భక్తులు  ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు  తీర్చుకున్నారు.