calender_icon.png 13 February, 2026 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రాస్ ఓటింగ్‌పై బెంబేలు!

13-02-2026 12:00:00 AM

అభ్యర్థుల కొంప ముంచనున్న రెబల్స్ 

నేడే తేలనున్న అభ్యర్థుల భవితవ్యం 

ఫలితాలు వచ్చేవరకు అభ్యర్థులకు దడదడ

కామారెడ్డి, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. తమ గెలుపును రెబెల్స్ అభ్యర్థులు అడ్డుకుంటారేమోనన బెంగ ప్రధాన పార్టీల అభ్యర్థులకు పట్టుకుంది. కొన్నిచోట్ల ప్రధాన పార్టీలు బీఫామ్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా రంగంలోకి దిగిన వారు ప్రధాన పార్టీ అభ్యర్థుల కొంప ముంచనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు హైరానా పడుతున్నారు.

ఎన్ని బుజ్జగింపులు చేసిన పలువురు అభ్యర్థులు ఇండిపెండెంట్గా రంగంలో నిలిచారు. ప్రచారం చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ గెలుపు ఖాయం కాకున్నా తమ బీఫామును దక్కించుకున్న వ్యక్తి ఓటమిపాలు కావాల్సిందే అంటూ కొందరు స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహించారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఓట్లు చీలిక  రెబెల్స్ అభ్యర్థులు రంగంలో ఉండి ప్రచారం చేయడంతో తమ గెలుపు కు ఓట్ల గండి కొట్టారని కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థు లు భావిస్తున్నారు.

ఫలితాలు వచ్చే వరకు తప్పని బెంగ 

కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద,మున్సిపల్ ఎన్నికలలో ప్రధాన పార్టీల నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీచేసిన అభ్యర్థులు తమ గెలుపు పై బెంగ పెట్టుకున్నారు. ఫలితాలు ప్రకటించే వరకు తమ గెలుపు ఖాయం కాదని అంటున్నారు. గెలుపు ఓటములు రెబెల్ అభ్యర్థుల ఓట్ల చీలిక బట్టే తమ భవిష్యత్తు ఉంటుందని మరికొందరు అభ్యర్థులు అంటున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్, బి ఆర్ ఎస్, బిజెపి  పార్టీల తరఫున పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలుపు పై  బెంగ పెట్టుకున్నారు. అభ్యర్థులకు గెలుపు పై అనుచరులు ఎన్ని చెప్పిన  పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం గెలుపుపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఓట్ల కౌంటింగ్ పూర్తి అయితేనే తమ గెలుపు ఖరారు అయ్యేవరకు తమకు బెంగ తప్పదని మరికొందరు అభ్యర్థులు అంటున్నారు. 

లక్షలు పోసి గెలుపుపై భారం 

కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థులు కొందరు గెలుపు కోసం లక్షల రూపాయలు ఓటర్లకు పంచిపెట్టారు. కానీ గెలుపు మాత్రం గ్యారెంటీ అనేది లేక ఆందోళన చెందుతున్నారు. తాము ఖర్చు పెడితే ఇతర పార్టీల వారు తమకు పోటీగా నిలిచిన అభ్యర్థులు కూడా ఓటర్లకు డబ్బులు, మధ్యము పంపిణీ చేశారని అందుకే గెలుపు పై డౌట్ ఉందని కొంతమంది అభ్యర్థులు విజయక్రాంతి ప్రతినిధితో తెలిపారు.

ఓట్ల కోసం లక్షలు పోసి ఖర్చు చేసిన గెలుపు పై ధీమా లేదని అంటున్నారు. రెబెల్స్ అభ్యర్థులు బరిలో ఉండడంతో తమ గెలుపోవటంల పై ప్రభావం ఉంటుందని పలువురు పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులు వాపోతున్నారు. పార్టీ పెద్దలు బీఫామ్ రాని అభ్యర్థులకు నచ్చచెప్పి విత్ డ్రా చేయిస్తే ఇంత భయా పడాల్సిన అవసరం  ఉండేవి కా కాదని అంటున్నారు.

మరో కొన్ని గంటలలో తేలనున్న భవితవ్యం 

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యం మరో కొన్ని గంటలలో తేలనుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ను అధికారులు ప్రారంభించనున్నారు. బాక్స్ లలోని ఓటర్ స్లిప్పులను తీసి అభ్యర్థుల వారీగా టేబుల్ లలో పెట్టిన అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు తెలిపారు. పార్టీ అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్లను అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థు సైతం తమ ఏజెంట్లను ఏర్పాటు చేశారు.

కౌంటింగ్ అధికారులు కౌంటింగ్ ఏజెంట్ల ముందు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఫలితాలు ప్రకటించే వరకు పోటీచేసిన అభ్యర్థులకు ఆందోళన తప్పదని అంటున్నారు.