జూపల్లిది పూటకో సవాల్, రోజుకో అడ్రస్
హైదారాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావు( Minister Jupally Krishna Rao) సవాల్ పై మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) స్పందించారు. మంత్రులు గోల్ కొడతామని సెల్ఫ్ గోల్ అయ్యారని ఎద్దేవా చేశారు. జూపల్లి తీరు పూటకో సవాల్.. రోజుకో అడ్రస్ లా ఉందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేయాలో అర్థంకాక డ్యామేజ్ కంట్రోల్ కు దిగారని తెలిపారు. తెలంగాణ భవన్ కు వస్తానని జూపల్లి కృష్ణారావు తోక ముడిచారని హరీశ్ రావు విమర్శించారు. 'గన్ పార్క్ కు దగ్గరకు రమ్మనాన్నారు.. గన్ పార్క్ కు కూడా వెళ్లేందుకు సిద్ధపడ్డాం.. కానీ పోలీసులతో మిమ్మల్ని అడ్డుకున్నారు' అని హరీశ్ రావు ధ్వజమెత్తారు. మంత్రి జూపల్లి రాసిన లేఖ నాకు అందింది. జూపల్లి లేఖలో కాంగ్రెస్ అప్పు రూ. 1.77 లక్షల కోట్లు.. RBI ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1.86 లక్షల కోట్లు అని హరీశ్ రావు వెల్లడించారు.
తనతో చర్చకు రావాలని కేసీఆర్ రావాలని ఇప్పుడు అంటున్నారు. తెలంగాణ భవన్.. గన్ పార్క్.. ప్రెస్ క్లబ్.. ఎన్ని వేదికలు మారుస్తారని చురకలంటించారు. తాము వచ్చాక రూ. 1.77 లక్షల కోట్లు అప్పు చేశామని జూపల్లి చెప్పారు. మార్చి నాటికి చేసిన అప్పులు రూ. 3.45 లక్షల కోట్లని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి, జూపల్లి చెప్పిన లెక్కల్లో తేడాలు ఉన్నాయని హరీశ్ రావు ఆరోపించారు. పాలమూరు పౌరుషం అంటే జూపల్లి వెంటనే రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తాము చేసిన అప్పుల గురించి అసెంబ్లీలోనే లెక్కలు చెప్పినట్లు సూచించారు.






