calender_icon.png 13 February, 2026 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి..

13-02-2026 12:00:00 AM

ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు డిమాండ్

బాన్సువాడ, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు గల ఎంఎల్‌ఎస్ పాయింటు వద్ద సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న చట్టాలను రద్దు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు.

44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ అమలు నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సివిల్ సప్లై హమాలీలకు స్వంత  గోదాములు నిర్మించాలని, హమ్మాలీలకు పని భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంపల సాయిలు, జట్పట్ భూమయ్య, రాపర్తి సాయిలు, ధర్మం చిన్న సాయిలు, కే సాయిలు తదితరులు పాల్గొన్నారు.