సర్‌పై ప్రజలకు వాస్తవాలు వివరించాలి
- కాంగ్రెస్ దుష్ప్రచారానికి చెక్ పెట్టాలి
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): తెలంగాణలో సర్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారానికి చెక్ పెట్టి, ప్రజలకు వాస్తవాలు వివరించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు నిర్ణయించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ అధ్యక్షతన అధికార ప్రతినిధుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో తెలంగాణలో ఇటీవల పూర్తయిన సర్ ప్రక్రియ, పార్లమెంట్‌లో కాంగ్రెస్-రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు, ఝార్ఖండ్‌లో పేపర్ లీకేజీ వ్యవహారం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పెద్ద సంఖ్యలో సర్ ఫారాలు పెండింగ్‌లో ఉండటం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోందని సమావేశం పేర్కొంది. రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం ఉధృతం చేస్తామని నేతలు పేర్కొన్నారు.






