12 August, 2026 | 10:08 AM

మల్లంపల్లిలో ఎంపీడీవో, ఎంఆర్ఓ కార్యాలయం మంజూరు పట్ల హర్షం

12-08-2026 08:45 AM

ములుగు, (విజయక్రాంతి): ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ మల్లంపల్లి మండల అభివృద్ధి కోసం మంత్రి సీతక్క చేస్తున్న కృషి అద్భుతమని కాంగ్రెస్ నేత మూల గణేష్ రెడ్డి కొనియాడారు. మల్లంపల్లిని మండలం గా ప్రకటించడంలో మంత్రి సీతక్క కృషి అభినందనీయమని అయితే ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నడంతో దీనిపై దృష్టి సారించిన మంత్రి కార్యాలయాల ఏర్పాటుకు హామీ ఇవ్వడం మండల ప్రజల అదృష్టం అన్నారు. మల్లంపల్లి మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధిపై మంత్రి సీతక్క దృష్టి సారించిందని, గతంలో ఎన్నడు లేని విధంగా మండలం అభివృద్ధి పథంలో మరింత ముందుకు దూసుకుపోతుందని తెలిపారు. మంత్రి సీతక్క మల్లంపల్లి మండలంలో ఎంపీడీవో ఎంఆర్ఓ కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు మండల ప్రజల పక్షాన ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.