08-02-2026 12:00:00 AM
సికింద్రాబాద్, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి) : బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో ఉన్న చెట్టు కొమ్మలకు మధ్యలో పదునైన నిషేధిత మాం జాలో గద్ద చిక్కుకున్న దృశ్యం కనిపించింది. అటుగా వెళుతున్న మల్కాజ్గిరి ట్రాఫిక్-1 అదనపు డిప్యూటీ కమిషనర్ ఏ.లక్ష్మి, తిరుమల గిరి ట్రాఫిక్ ఏసీపి జి.శంకర్ రాజు గమనించి తక్షణమే ట్రాఫిక్ పోలీసులు సహకారం తో గద్దకు ఎలాంటి హానికలగకుండా ఎంతో జా గ్రత్తగా చెట్టుపై నుండి దింపి,దాని కాళ్లకు బిగుసుకుని ఉన్న నిషేధిత మాంజాను తొలగించి గద్దను ప్రాణాపాయం మంచి రక్షించ డంతో సురక్షితంగా ఎగిరిపోయింది. మానవత్వంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు అభినందించారు.