7 July, 2026 | 1:41 AM

రేపటితో ముగియనున్న సుడా పదవీకాలం

07-07-2026 12:00 AM
  1. కోమటిరెడ్డిని పొదగించే అవకాశం. 
  2. ప్రయత్నం ముమ్మరం చేసిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్,జూలై6(విజయక్రాంతి): కార్పొరేషన్ పదవుల పునర్నియా మకంపై అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొం ది. కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కాలం రేపటితో ముగియనుంది. ప్రస్తుత చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ని తిరిగి కోమసాగించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. అయితే అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తన వంతు ప్రయత్నం ముమ్మరం చేశారు. పదవిలో కొనసాగాలనే ప్రస్తుత చైర్మన్ ప్రయత్నాలు ఒక వైపు..

కొత్త అవకాశాల కో సం ఆశావహుల లాబీయింగ్ మరో వైపు ఊపందుకోవడంతో రాజకీయ సమీకరణా లు వేడెక్కుతున్నాయి.ప్రస్తుత చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పార్టీ అధికారంలో లేని నాటి నుండి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుని గా గడ్డుకాలం లో సేవలు అందించిన పేరు ఉంది. ప్రస్తుతం సూడా చైర్మన్గ్ గా గతంలో ఎవరు చేయని విదంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ప్రతిపక్షాల కు ఘాటుగా కౌంటర్ అటాక్ చేస్తూ పార్టీ ఉనికిని కరీంనగర్ లో కాపాడుతున్నారన్న పేరు ఉంది.

కార్పొరేషన్ చైర్మన్ల పనితీరు, పార్టీకి, ప్రభుత్వానికి తీసుకొచ్చిన మైలేజ్? ప్రామా ణికంగా నామినేటెడ్ పదవులు పట్టబెట్టను న్నట్లు తెలుస్తోంది. ఈ మూడు అంశాలపై సీఎం రేవంత్రెడ్డి నివేదికలు తెప్పించుకున్న ట్లు సమాచారం. ఇందులో ఎవరు మంచిగా పని చేశారు.. వివాదాలకు దూరం గా ఉం టూ పార్టీని, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసిన వారి జాబితాను సిద్ధం చేసిన ట్లుగా చర్చ జరుగుతోంది. ఈ అంశమే కోమటిరెడ్డి కి కలసి వస్తుందని ఆయన వర్గీయులు అంటున్నారు.

పార్టీని, ప్రభుత్వా నికి మంచి పేరు తీసుకొచ్చిన వారికి మరొక మారు అవకాశం కల్పించాలని సీఎం రేవం త్రెడ్డి ఫిక్స్ అయినట్లుగా చర్చ జరుగుతోం ది కూడా. 37 మందిలో 10 నుంచి 15 మందిని పదవుల్లో కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కోమటిరెడ్డి కోమసాగింపు ఖాయమే. అయితే ఈ పదవి పై కన్నేసిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తో పాటు ఆకారపు భాస్కర్ రెడ్డి, మాచర్ల ప్రసాద్ లు తవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి సూడా పై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకండి.     

ఉమ్మడి జిల్లా నేతల్లో చిగురించిన ఆశలు. 

సూడా తో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ ల భర్తీ చేయనుండటంతో ఉమ్మడి జిల్లా నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా జువ్వాడి నర్సింగా రావు లు కొనసాగుతున్నారు.త్వరలో మరిన్ని భర్తీ కానుండటంతో ఆశావాహుల్లో ఆశలు చిగిరించాయి.