16 July, 2026 | 12:23 AM

డంపింగ్ యార్డ్‌ను శాశ్వతంగా తొలగించాలి

16-07-2026 12:01 AM
  1. 26న జరుగనున్న మేధావుల సదస్సును విజయవంతం చేయండి 
  2. డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్:షేక్షావలి

జవహర్‌నగర్, జూలై 15 (విజయక్రాంతి): ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను శాశ్వతంగా తొలగించాలని, ఈ నెల 26న నిర్వహించనున్న మేధావుల సదస్సును విజయవంతం చేయాలని డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి పిలుపునిచ్చారు. సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక్ నగర్ ప్రజలను ఇ బ్బందులకు గురిచేసే చర్యలను ఖండిస్తూ, డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో కోశాధికారి శివబాబు, కో-కన్వీనర్ ప్రవీణ్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, ఉపసర్పంచ్ రావాల్కోల్ నరసింహ గౌడ్, అనంతలక్ష్మి, మేక లలితా యాదవ్, భద్ర కాళి, ఆంజనేయులు, తోటపల్లి శంకర్, గడ్డం సదానందం, చంద్రన్న, ప్రసాద్, జయ, పెరక సునీ త, మహమ్మద్ పాషా మియా, మోహిన్, డి. స్వరూప, లక్ష్మీబాయి, జయసుధ, జావేద్, టి. కలేశా, విజయ్, అల్లూరి సావిత్రి, కే. వేణు తదితరులతో పాటు కార్మిక్ నగర్ ప్రజలు పాల్గొన్నారు.