16 July, 2026 | 12:35 AM

19న శ్రీ జగన్నాథ రథయాత్ర

16-07-2026 12:00 AM

హైదరాబాద్ హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): హైదరాబాద్ హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో కోకాపేట నార్సింగిలో ఈ నెల 19న తొలిసారిగా శ్రీ జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ రథయాత్ర కోకాపేట వీధుల మీదుగా హరే కృష్ణ హెరిటేజ్ టవర్ వరకు సాగనుంది.

శ్రీ జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవి విగ్రహాలతో జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగే అవకాశం కల్పించనున్నట్లు హైదరాబాద్ హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు, అక్షయ పాత్ర (తెలంగాణ-ఆంధ్రప్రదేశ్) రీజినల్ ప్రెసిడెంట్ సూర్య గౌర చంద్ర దాస్ ప్రభుజీ తెలిపారు.