16 July, 2026 | 12:38 AM

ప్రతీ ఫిర్యాదుపై తక్షణ స్పందన

16-07-2026 12:20 AM

భైంసా, జులై 15 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భైంసా సబ్డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 15 మంది ఆర్జిదారుల ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు.

ఫిర్యాదు దారుల ఎదుటే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని సూచించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారు లకు ఆదేశాలు జారీ చేశారు.

కుటుంబ వివాదాల పరిష్కారంలో ‘షీ టీం’ పాత్ర:

ఈ కార్యక్రమంలో వచ్చిన కొన్ని కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ ద్వారా కుటుంబాలు తిరిగి కలుసుకో వడం జరిగింది. ప్రజలు నిర్మల్ వరకు రావ డం కష్టంగా ఉండగా, భైంసాలోనే కౌన్సిలింగ్ కల్పించడం పై ఎస్పీ గారు చూపిన ఆలోచనను బాధితులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

పెండింగ్ ఫిర్యాదులపై సమీక్ష:

ఈ సందర్భంగా గతంలో గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, ఇంకా పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని పెండింగ్ లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలన్నారు.