calender_icon.png 8 February, 2026 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు

08-02-2026 12:00:00 AM

కీసరగుట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

మేడ్చల్, ఫిబ్రవరి 7(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి పరిశీలించారు. ఆలయ అధికారులకు పోలీస్ కమిష నర్ పలు సూచనలు చేశారు. దూర ప్రాం తాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి గా పర్యవేక్షించాలన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండాలని తాగునీరుకు ఎలాం టి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.