calender_icon.png 8 February, 2026 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమల గుప్పిట్లో ఇబ్రహీం బాగ్

08-02-2026 12:00:00 AM

మళ్లీ పెరిగిన గుర్రపు డెక్క.. కలుషితమైన చెరువు

సిటిజన్స్ కౌన్సిల్

క్షేత్ర స్థాయి పరిశీలన అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్

మణికొండ, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): నెక్నంపూర్ డివిజన్ పరిధిలోని ఇబ్రహీం బాగ్ చెరువు మరోసారి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. చెరువు నీరు కలుషితమై, గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిపోవడంతో దోమలకు ఆవాసంగా మారింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై గతంలో ’ది సిటిజన్స్ కౌన్సిల్’ ఆధ్వర్యంలో స్థానికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన విషయం విదితమే. అప్పట్లో మున్సిపల్ అధికారులు స్పందించి, వెస్సెల్లా మెడోస్ సహకారంతో దోమల నియంత్రణ చర్యలు చేపట్టారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. చెరువులో గుర్రపు డెక్క అదుపు లేకుండా పెరగడంతో దోమల బెడద తీవ్రరూపం దాల్చింది.

ఈ నేపథ్యంలో ది సిటిజన్స్ కౌన్సి ల్ సెక్రటరీ షేక్ ఆరిఫ్ మొహమ్మద్, ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, కోశాధ్యక్షురాలు సుమ నళిని, సభ్యులు అజయ్ రెడ్డి, రాంచందర్ రావు, దిలీప్ కక్కడ్, బొడ్డు శ్రీధర్ తది తరులు చెరువును క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భం గా కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ.. అధికారులు తక్షణమే స్పందించి దోమల నివార ణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమానికి వెస్సెల్లా మెడోస్ నివాసితులు పూర్తి మద్దతు, సహకారం అందిం చడానికి సిద్ధంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. అధికారులు అలసత్వం వహించకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉం చుకుని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.