3 July, 2026 | 6:11 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు

03-07-2026 04:59 PM

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటని అరుణోదయ కళాకారుల బృందం పేర్కొన్నారు. చిన్నతనం నుంచే విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితులైన నాగన్న, ఎమర్జెన్సీ కాలంలో కామ్రేడ్ శ్రీహరి అడుగుజాడల్లో నడుస్తూ తన తుది శ్వాస వరకు ఉద్యమానికి అంకితభావంతో సేవలందించారని కొనియాడారు. నాగన్న మరణం ఉద్యమ శ్రేణులకు, కుటుంబ సభ్యులకు తీరని లోటని అన్నారు. చిన్ననాటి నుంచే తమ కుటుంబంలో ఒక సభ్యుడిలా కలిసి ఉద్యమ బాటలో నడిచిన నాగన్న ఇక లేరనే విషయం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు విప్లవ జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలంగాణ కళాకారుల బృందం పేర్కొన్నారు.