04-02-2026 12:33:51 AM
సికింద్రాబాద్ ఫిబ్రవరి 3,(విజయ క్రాంతి): దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ గా గుర్తింపు పొందిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో గత కొన్ని దశాబ్దాలు గా కొనసాగుతున్న తొమ్మిది బస్తీల ప్రజల సమస్యలు మరోసారి చర్చకు వచ్చాయి. సోమవారం గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మాలుగారం ను కలిసి బస్తీ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని తొమ్మిది బస్తీల్లో నివసిస్తున్న ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారని వీసీ దృష్టికి తీసుకువచ్చారు. అనం తరం డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నగరానికి గర్వకారణం. ఇక్కడి అభివృద్ధికి అడ్డంకిగా మారిన సమస్యలను రాజకీయాలకు అతీతంగా మానవ తా దృక్పథంతో పరిష్కరించాలని అని ఆమె అన్నారు.