04-02-2026 12:30:46 AM
కాకతీయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయ పీ.జీ మూడవ సెమిస్టర్ పరిక్షలు మంగళవా రం ప్రశాంతంగా నిర్వహించినట్లు విశ్వవిద్యాలయ పరిక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంపస్ లోని కంప్యూటర్ సైన్సు, వివిధ విభాగలను సందర్శించారు. పరిక్షల నియంత్రణ అధికారి వెంట కాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి. మనోహర్, అదనపు పరిక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.మమత, కంప్యూటర్ సైన్సు విభాగ అధిపతి డాక్టర్ బి.రమ ఉన్నారు.