గ్లోబల్ లీడర్స్.. లోకల్ టాక్స్
- జీ-7 సదస్సులో అగ్రదేశాల అధినేతల సరదా సంభాషణ
- సోషల్ మీడియాలో వైరల్
ప్యారిస్ : ఫ్రాన్స్‌లోని ఎవియాన్ నగరంలో జరుగుతున్న 52వ జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ అగ్రదేశాల అధినేతల మధ్య జరిగిన కొన్ని సరదా సంభాషణలు వైరల్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర మిత్రదేశాల అధినేతలతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు జరిగిన సంభాషణలు సోషల్ మీడియాల్ ట్రెండ్ అయ్యాయి. జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్.. ఇటలీ ప్రధాని మెలోనీని సిగరెట్ గురించి అడిగారు.
దానికి మెలోని స్పందిస్తూ నేను స్మోకింగ్ చేయటం లేదు, మే1నుంచి వదిలేశాను అని చెప్పగానే .. అక్కడున్న నేతలంతా అభినందించారు. నిగ్రహం కోసం నికోటిన్ ఏమైనా వాడుతున్నారా? అని కెనడా ప్రధాని మార్క్‌కార్నీ చమత్కరించడంతో అక్కడున్న నేతలంతా నవ్వారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తన వాచ్‌ను మీటింగ్ రూమ్‌లో మర్చిపోగా.. కెనడా ప్రధాని గుర్తు చేశారు.
వెంటనే ట్రంప్ జోక్యం చేసుకొని.. ఆయన వెళ్లిపోతే ఆ వాచ్ నాకు ఇచ్చేయండి’ అంటూ జోక్ చేశారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో జర్మనీపై.. ప్యారిస్ సెయింట్ టీం గెలుపు గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రస్తావించగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన 80వ పుట్టిన రోజున వైట్ హౌస్‌లో హోస్ట్ చేసిన యూఎఫ్సీ కేజ్-మ్యాచ్ గురించి మురిసిపోతూ చెప్పారు. ఇదే సమయంలో డొనాల్ ట్రంప్ యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాతో ఏదో రహస్యంగా మాట్లాడారు.
కోస్టా వైపు సూటిగా చూస్తూ.. అర్థమైందా? గ్రీన్లాండ్’ అంటూ ట్రంప్ కామెంట్ చేశారు. జీ-7 సదస్సుకు విచ్చేసిన దేశాధినేతలకు మాక్రాన్ ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. వచ్చే ఏడాది ఫ్రాన్స్‌లో జరిగే సైక్లింగ్ వరల్ ఛాంపియన్షిప్ ప్రమోషన్ కోసం ఈ ప్లాన్ చేశారు. జర్మనీ ఛాన్స్‌లర్ .. ట్రంప్ పేరు, 47 నంబర్‌తో ఉన్న జర్మనీ నేషనల్ ఫుట్‌బాల్ జట్టు జెర్సీని ట్రంప్‌కు బహుమతిగా ఇచ్చారు. ఇక మనమంతా ఒకే టీం అంటూ మెర్జ్ ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.






