15 May, 2026 | 1:03 AM

భయపెట్టేందుకు వస్తున్న ఆది

16-05-2026 12:00 AM

‘శంబాల’ చిత్రంతో విజయాన్ని అందుకున్న షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు, దర్శకుడు యుగంధర్ ముని, హీరో ఆది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచారు. వీరంతా కలిసి ఇప్పుడు మరో వినూత్నమైన కథాంశంతో ఓ ప్రయోగం చేయబోతోన్నారు.

యుగంధర్ ముని సమర్పణలో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలైన మహిధర్‌రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు ఆదితో ఈ సినిమాను నిర్మించనున్నారు. బృందా రవీందర్ దర్శకత్వం వహించనున్నారు.  ఈసారి ఎమోషన్స్‌తోపాటు హార ర్ ఎలిమెంట్స్‌తో సరికొత్త అనుభూతిని అందించే కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు టీమ్ వెల్లడించింది. ఈ మేరకు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌లో ఆది సాయికుమార్ ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.