ప్రగతి తప్పుతున్న చక్రం
- ప్రమాదాల బారిన ఆర్టీసీ బస్సులు
- ప్రశ్నార్థకమవుతున్న ప్రయాణికుల భద్రత
- క్షేత్రస్థాయిలో కరువైన పర్యవేక్షణ
సంగారెడ్డి, మార్చి 1(విజయక్రాంతి): ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.. శుభప్రదం అని చెప్పుకునే సంస్థ మాటలు నీటి మూటలవుతున్నాయి. ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన బస్సులు తరచూ ప్రమాదానికి గురవుతుండడంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్ధకంగా మారుతుంది. మహాలక్ష్మి పథకం అమలులోకి రావడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అదేస్థాయిలో ఉద్యోగులపై అదనపు భారం పడుతోంది.
మరోవైపు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా.. ఉన్న అరకొర సిబ్బందిపైనే సంస్థ ఉన్నతాధికారులు అదనపు భారం మోపుతున్నారు. దీం తో వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నా రు. ఈ క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పటాన్చెరు మండ లం రుద్రారం, సదాశివపేట వద్ద శనివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో బస్సుల్లో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది వరకు గాయాలపాలయ్యారు. ప్రమాదంలో ఎలాం టి ప్రాణహాని జరగక పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
డ్రైవర్లపై పని ఒత్తిడి..
ఆర్టీసీలో నిష్ణాతులైన డ్రైవర్లను నియమిస్తారు. అయినప్పటికీ ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం కలవరపాటు కలిగిస్తుం ది. ఉద్యోగులకు వరుసగా డ్యూటీలు వేస్తుండడం.. రాత్రి విధులు నిర్వహించిన వారికి సరైన విశ్రాంతి లేకుండానే వెంటనే డ్యూటీ లు అలాట్ చేస్తున్నారు. దీంతో వారంతా నిద్రలేమితో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో జరుగుతున్న ప లు బస్సుల ప్రమాదాలు డ్రైవర్లకు తీవ్రమైన పని ఒత్తిడి వల్లనే జరిగినట్లు తెలుస్తోంది.
ప్రయాణికుల భద్రతపై నీలినీడలు..
ప్రైవేటుతో పోల్చితే ఆర్టీసీ బస్సులే క్షేమమని జనం నమ్ముతారు. అయితే ఈ మధ్య ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదాలకు గురవుతుండడం ప్రయాణికుల్లో భయాన్ని పెం చుతోంది. ముఖ్యంగా ఆర్టీసీలో సొంత డ్రైవ ర్ల కంటే, అద్దెకు తీసుకున్న (హైర్) బస్సుల డ్రైవర్ల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. అద్దె బ స్సు ల్లో కండక్టర్లు ఆర్టీసీ వారే ఉన్నా, డ్రైవర్లను మాత్రం ఆ బస్సు యజమానులే పెట్టు కుంటారు. దీనిని ఆసరాగా తీసుకుని కొంతమంది యజమానులు తక్కువ జీతానికే దొ రికే, సరైన అనుభవం లేని వారిని పనిలో పె ట్టుకుంటున్నారు. ఇలాంటి అనుభవం లేని డ్రైవర్ల వల్లే ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
తూతూ మంత్రంగా శిక్షణ..
రోడ్డు ప్రమాదాలు నివారించేలా ఏటా రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఆర్టీసీలో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, పలు సందర్భాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తుండడంతో ఫలి తం ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఆర్టీసీ ప్ర మాదాల్లో ముఖ్యంగా సంస్థ డ్రైవర్లతో పో ల్చితే పీహెచ్బీ డ్రైవర్ల కారణంగానే ఎక్కువగా చోటు చేసుకుంటుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేస్తున్న అధికారులు, తప్పు తమపై పడకుండా డ్రైవర్లు, కండక్టర్లపై నెట్టివేస్తున్నారని పలువురు ఉద్యోగులు బాహ టంగానే పేర్కొంటున్నారు.




