తాడువాయి ఆశ్రమానికి గురుపౌర్ణమి లడ్డు ప్రసాదం
27-07-2026 01:01 PM
బోథ్, జూలై 27 (విజయ క్రాంతి): మండలంలోని కౌటా బి శబరి మాత ఆశ్రమంలో లడ్డు ప్రసాదాన్ని సోమవారం భక్తులు సిద్ధం చేశారు. ప్రతి సంవత్సరం కామారెడ్డి జిల్లాలోని తాడువాయి శబరిమాత ఆశ్రమంలో నిర్వహించే గురు పౌర్ణమి వేడుకలకు ఇక్కడినుండే లడ్డు ప్రసాదాన్ని తయారుచేసి పంపించడం జరుగుతుంది. అయితే లడ్డూ ప్రసాదం తయారీలో శబరిమత ఆశ్రమ భక్తులు చందాలు చేసి గురుదక్షిణగా ఇవ్వడం జరుగుతుంది. లడ్డూలు కామారెడ్డి జిల్లాలోని తాడువాయి ఆశ్రమంలో విక్రయించడం వచ్చిన ఆదాయాన్ని అక్కడే శబరిమత ఆశ్రమానికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఏటా భక్తులు ఈ కార్యక్రమానికి కొనసాగిస్తున్నారు.






