రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం
బోథ్, జూలై 27 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రం లోని గ్రామాభివృద్ధి కమిటీ రామాలయ కమిటీ చైర్మన్ పదవులపై రాజకీయరంగు పులుముకుంటున్నది. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లక్షల రూపాయల ఆస్తులు ఉండగా రామాలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ కొనసాగుతున్నారు.
రామాలయ కమిటీ అధ్యక్షునిగా భారతీయ జనతా పార్టీ మాజీ మండల కన్వీనర్ సుభాష్ సూర్య వ్యవహరిస్తున్నారు అయితే రామాలయ కమిటీ చైర్మన్ గతంలో తాత్కాలిక కమిటీ చైర్మన్ గా ఎన్నుకోగా గ్రామ అభివృద్ధి కమిటీ గతంలో ఎన్నుకోవడం జరిగింది. అయితే అభివృద్ధి కమిటీ లో నిధుల వినియోగం తదితర అంశాలపై ఇంతవరకు లెక్కలు చూపడం లేదంటూ అభివృద్ధి కమిటీ లో సభ్యులుగా కొనసాగిన భీమ్రావు పాటిల్ పోస్టు పెట్టడంతో కమిటీలపై గ్రామంలో చర్చ మొదలైంది. అభివృద్ధి కమిటీకి అద్దె రూపంలో వస్తున్న నగదు విషయం సమావేశాలు నిర్వహించి తెలపాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గాజుల పోతన్న ఏకంగా ఇద్దరు అధ్యక్షులు రాజీనామా చేసి తీరాల నీ డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా రామాలయ కమిటీ గ్రామాభివృద్ధి కమిటీకి రాజకీయ రంగు రాసుకుంటున్నది






