27 July, 2026 | 1:33 AM

అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి భక్తుల సహకారం కీలకం

27-07-2026 12:40 AM
  1. మంత్రి కెప్టెన్ ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతిల సహకారంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం 
  2. హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్

హుజూర్ నగర్,జూలై 26: అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి భక్తుల సహకారం అత్యంత కీలకమని,మంత్రి కెప్టెన్ ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిల సహకారంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ తెలిపారు.పట్టణంలోని శివాలయంలో ఆదివారం అయ్యప్ప స్వామి దే వాలయం నిర్మాణ కమిటీ సమావేశం నిర్వహించి పలువురు గ్రామ పెద్దలు మాట్లాడా రు...

శివాలయం పక్కనేఉన్నటువంటి స్థలంలో 2300 చదరపు గజానాలలో సుమారు 3 కోట్లతో అత్యాధునిక హంగులతో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మాణా నికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిల సహాయ సహకారాలతో శ్రావణమాసంలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపా రు. ఆలయ నిర్మాణానికి పలువురు దాతలు లక్ష రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు.అనంతరం దాతలను ఆలయ కమిటీ అభినందించారు.

కోలా నాగేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్,పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి,పశ్య శ్రీనివాసరెడ్డి, దేవరం ప్రభాకర్ రెడ్డి,తండు సైదారత్నం, పెండ్యాల నాగేందర్, సురేందర్,బెల్లంకొండ శ్రీనివాసు, తదితరులు,పాల్గొన్నారు.