ఘనంగా ఆషాఢ బోనాల మహోత్సవం
46వ డివిజన్ బీఆర్‌ఎస్ ఇంచార్జ్
పాల్వంచ, జూలై 26, (విజయక్రాంతి): ఆషాడ మాసం సందర్భంగా ఆదివారం పాల్వంచ 46వ డివిజన్లో టిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల మహోత్సవం నిర్వహించారు. శ్రీ విజయ శాంభవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు వాద్యాల నడుమ, భక్తజనాలతో కలిసి ఉత్సాహంగా బోనాల ఊరేగింపులో పాల్గొని పండుగ సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా రజక వీధి ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ‘భక్తి, సంప్రదాయం, ప్రజలతో మమేకమే మన సంస్కృతికి ప్రతీక‘ అని పేర్కొంటూ, పండుగను విజయవంతం చేసిన నిర్వాహకులు, యువకులు భక్తులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.






