24 August, 2026 | 5:27 AM

కాంగ్రెస్ కథ కంచికే..

24-08-2026 01:26 AM
  1. రేవంత్ రెడ్డికి సభాపక్షంలో బలం లేదు!
  2. దమ్ముంటే కొండా సురేఖను తప్పించి చూడు
  3. టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న సవాల్

హైదరాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, రాష్ట్రంలోని విశ్వవిద్యాల యాల దుస్థితి, అంబేద్కర్ విదేశీ విద్యా పథకాల అమలులో వైఫల్యాలు, అలాగే బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ రెడ్డి, వెలమ సామాజిక వర్గాల ఆధిపత్యం కొనసాగుతు న్న నియోజకవర్గాలపై అలాగే రాజకీయాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపుతూ టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మొదటగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన మల్లన్న, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కూల్చడానికి ఇతర రాజకీయ పార్టీల అవసరం లేదని, ఆ పార్టీ నేతలే తమ ఉరితాడును తామే పేనుకుంటూ పార్టీ ని సంక్షోభంలోకి నెట్టేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో కనీస సభ్యత్వం కూడా లేని కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై వ్యాఖ్యలు చేయగా, సభ్యత్వం ఉన్న ఎమ్మెల్యేలు సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కొండా సురేఖపై చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని అన్నారు.కొండా సురేఖ వ్యవహారం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు బలం బయటపడిందని మల్లన్న పేర్కొన్నారు.

ప్రెస్ మీట్కు 40 మంది ఎమ్మెల్యేలను పిలిచినా కేవలం 18 మంది మాత్రమే హాజరుకావడం ఆయనకు సభాపక్షంలో ఉన్న మద్దతు ఎంత పరిమితమో వెల్లడించిందన్నారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా తీసుకొని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించి, ఆయన స్థానంలో బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ను లేదా కొండా సురేఖను ముఖ్యమంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీలకు రాజకీయ అధికారం దక్కాల్సిన అవసరం ఉందని,

బీసీ నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తు న్నారని మల్లన్న అన్నారు. విద్యారంగంపై స్పందిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సంద ర్శించి తెలంగాణకు రావాలని ఆహ్వానించ డం కంటే ముందుగా రాష్ట్రంలోని ఉస్మాని యా, కాకతీయ విశ్వవిద్యాలయాల దుస్థితిని గమనించాలని సూచించారు.రాష్ట్రంలోని ప లు నియోజకవర్గాల్లో బీసీలు మెజారిటీ ఓటర్లుగా ఉన్నప్పటికీ రెడ్డి,

వెలమ సామాజిక వర్గాలే రాజకీయ ఆధిపత్యం కొనసాగిస్తున్నాయని మల్లన్న గణాంకాలతో వివరించారు. యాదవ్, గౌడ్, ముదిరాజ్, పద్మశాలీ, ము న్నూరుకాపు తదితర బీసీ సామాజిక వర్గాలకు చెందిన బలమైన నాయకులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీసీ చైతన్య పాదయాత్ర చేపట్టనున్నట్లు   తెలిపారు.

టీఆర్పీలో పలువురి చేరిక

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)లో చేరికల పర్వం కొనసాగుతోంది. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్పీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు కొమిరిశెట్టి నర్సింహులు, గుండాల మండల అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న నూతనంగా పార్టీ లో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ సామాజిక న్యాయం, బీసీల రాజ్యాధికారం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీఆర్పీ ముందు కు సాగుతోందని తెలిపారు. పార్టీ సి ద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ ప్రాంతాల నుం చి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు.