24 August, 2026 | 3:30 AM

బాధిత కుటుంబాలకు బాసటగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

24-08-2026 02:35 AM

ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య

మహబూబాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పక్షాన ఉంటూ బడుగు బలహీనుల బలోపేతానికి, వారి వ్యక్తిగత వికాసానికి తోడ్పాటును చేయూతనందిస్తుందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. ఆదివారం జిల్లాలోని తొర్రూరు మండలం చర్లపాలెంలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

అనంతరం చైర్మన్ రాజయ్య మీడియాతో మాట్లాడుతూ నేటి యువత, రేపటి భవితఅని, ప్రజల కోసం ఏర్పడిన ప్రజాస్వామ్య దేశంలో యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. దేశ భవిత యువత రాజకీయాలపై ఆధారపడి ఉందని, పేద ధనిక లింగ బేధ ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సమాన ఓటు హక్కు కల్పించారన్నారు. ఐదు సంవత్సరాలకోసారి, ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ ప్రక్రియ, నచ్చినవారికి ఓటు వేసే స్వేచ్చా హక్కులు కల్పించబడిందన్నారు.

ప్రజాస్వామ్య పునాదులు మన గ్రామ పంచాయితీలని, ఆర్ధిక స్వలంబన బలోపేతానికి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయనైనదని, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపారమైన నమ్మకంతో, స్థానిక స్వయం పరిపాలన సంస్థల్లో అనుభవం ఉన్న తనకు బాధ్యతలు అప్పగించారని, చిత్తశుద్ధితో ప్రతి మారుమూల గ్రామ పంచాయితీల అభివృద్ధి ధ్యేయంగా వ్యవస్థకు, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య అన్నారు.