10 May, 2026 | 10:18 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంది

09-02-2026 12:00 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి ఆరోపణ

ఆదిలాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల టికెట్లను అమ్ముకుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆఖరి క్షణం వరకు సీపీఐ కాంగ్రెస్ మిత్ర పక్షంగా వ్యవహరిస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ జాదవ్ ఇచ్చిన మాట ప్రకారం సీపీఐ పార్టీ చెప్పిన 8 సీట్లకు బదులుగా రెండు లేదా మూడు కేటాయిస్తామని ఒప్పందమైనప్పటికీ టికెట్టు కేటాయించలేదన్నారు.

ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీని నమ్ముకుని గెలిచే వారికి టికెట్ ఇవ్వకుండా ఒక టికె ను రూ. 10 లక్షలు ఇంకాపైకి అమ్ముకున్నారని, నేతలు కుమ్ముక్కై రెండు కోట్లు రూపాయలు వసూలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారనీ తెలిపారు. జిల్లా సీపీఐపార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ను ఓడించి, సీపీఐతో పాటు ఇతర ప్రతిపక్షాలను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అరుణ్ కుమార్, షేక్ పాషా, అర్ధాంగి రమేష్, రామదాస్, సురేష్, ప్రభాకర్ పాల్గొన్నారు.