10 May, 2026 | 9:09 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి

09-02-2026 12:00 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, ఫిబ్రవరి 8(విజయక్రాంతి): ప్రభుత్వ మాతా, శిశు ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.  శనివారం పట్టణంలోని మాతా, శిశు ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్పేషంట్, ఔట్పేషంట్ వార్డులు, ఆపరేషన్ థియేటర్, రక్తపరీక్షల గది, స్కానింగ్ కేంద్రం, టీకాల గది, చిన్నారులకు పాలిచ్చే గది, మందుల గది, మరుగుదొడ్లు తదితర విభాగాలను పరిశీలించారు.

పలు రిజిస్టర్లను తనిఖీ చేసి, అన్ని విభాగాల్లో రికార్డులను సక్రమం గా నిర్వహించాలని సూచించారు. అవసరమైన టీకాలు, మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లి బిడ్డలకు మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. ఈ తనిఖీలో ఆర్‌ఎంవో రమేష్, విభాగాధిపతి సరోజ, ప్రోగ్రాం ఆఫీసర్ సౌమ్య, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి, తహసిల్దార్ రాజు, వైద్యులు పాల్గొన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవాలి 

నిర్మల్, ఫిబ్రవరి ౮ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని నిర్మల్ ఖానాపూర్ బైంసా మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించినందుకు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నిర్మల్ బైంసా ఖానాపూర్ పట్టణాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉద్యోగులు ఈనెల తొమ్మిది లోపల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు.