28 April, 2026 | 5:25 PM

Breaking News

జొన్నల కొనుగోలు సెంటర్లను పెంచండి   •   తుమ్మల నివాసంలో పూర్వ మిత్రుల కలయిక   •   అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •   దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ   •   దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక   •   బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం   •   నిలిచిపోయిన నీటి దారులు   •   బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్   •   సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ   •   గుగ్గిళ్ళ రమేష్ పై తగిన చర్యలు తీసుకోవాలి: ఉద్యోగుల జేఏసీ   •  

ఆరు గ్యారెంటీల మాదిరిగానే బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

10-10-2025 12:50 AM

రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్

సూర్యాపేట అక్టోబర్ 9 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో పరోక్షంగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యులు, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.

గురువారం జిల్లా కేంద్రాల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత 50 సంవత్సరాలుగా బీసీలకు బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకమని కోర్టులో జీవో 9 నిలబడదని తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం నటించిందన్నారు. ఆర్టికల్ 9 సవరించి పార్లమెంటులో అనుమతి వస్తే తప్ప ఇది సాధ్యం కాదనీ బిఆర్‌ఎస్ మొదటి నుంచి చెబుతుందన్నారు.

బిసి రిజర్వేషన్లు ఇచ్చామని ఏదో పోరాడమని చెప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నటించిందన్నారు. కోర్టు స్థానిక సంస్థల నోటిఫికేషన్ నిలిపివేసిందని దీనికి ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ అన్నారు. ఆరూ గ్యారంటీల మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో బీసీల మనోభావాలను ఆత్మ గౌరవాన్ని అగౌరవపరిచిందన్నారు.

నోటిఫికేషన్ వెలువడటంతో ఎంతో మంది బీసీ అభ్యర్థులు డబ్బులు పోగొట్టుకున్నారని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. బిఆర్‌ఎస్ మొదటి నుంచి చెబుతున్నట్లుగానే 42 శాతం రిజర్వేషన్లు వచ్చేందుకు పోరాడుతుందన్నారు.  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్‌ఎస్ సిద్ధంగా ఉంటుందన్నారు.