24 July, 2026 | 3:01 AM

కాంగ్రెస్‌వి హింసాత్మక రాజకీయాలు

24-07-2026 12:42 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీల్ రావుఫైర్

ముకరంపుర, జూలై 23(విజయ క్రాంతి) డిల్లీలో నీట్ ఎగ్జామ్ సాకుతో కాక్రోచ్,కాంగ్రెస్ పార్టీలు హింసాత్మక రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ద్వజమెత్తారు. కరీంనగర్ లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాక్రోచ్, కాంగ్రెస్ పార్టీల తీరు పై ఫైర్ అయ్యారు. బొద్దింకల ముసుగులో సిజేపి ఒక వైపు సందట్లొ సడేమియ్య అన్న చందంగా కాంగ్రెస్ రాజకీయాలు చేయడం దుర్మార్గం అని మండి పడ్డారు. .

విద్యార్థులు ఆందోళనలు చేస్తే ముసుగులు ఎందుకు వేసుకోవడం అని ద్వజమెత్తారు.చేసే ఆందోళన సరికాదని పోలీసులు అరెస్టు చేస్తే దాన్ని సాకుగా తీసుకోని రా ష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఎలాంటి హింసాత్మక ఆందోళనలు చేశారో ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాగా భారత దేశాన్ని చేస్తామని కాక్రోచ్ లు వాఖ్యలు చేస్తుంటే వారి ఆంధోళనల వేనుక ఉన్న రహస్య ఎజెండా ఏంటో ప్రజలు గమనించాలని పిలుపు నిచ్చారు.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో వందల సార్లు పోటి పరీక్షలు లీకేజీ అయ్యాయని మండి పడ్డారు.13 మంది దోషులను పట్టుకొని శిక్షలు వేసిన ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం దే అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ప్రజా స్వామ్య బద్ధంగా చర్చించాలని హితవు పలికారు. బీజేపీ పార్టీ కార్పొరేటర్లు రమ-శివరాం, లక్ష్మి-ప్రకాష్, రవీందర్, గణేష్, లక్ష్మి మొండయ్య గౌడ్, రమ్మ-శ్రీనివాస్, సరస్వతి-సత్యనారాయణ, పద్మ-అనిల్ , వెంకటేష్, పవన్, శ్వేత-రామణ్, కె ఎపిపి చంద్ర,కో-ఆప్షన్ మెంబర్ కన్న కృష్ణ, బిజెపి మీడియా ఇంచార్జ్ లోకేష్, కో ఆప్షన్ మెంబర్ బల్వీర్ సింగ్, బిజెపి నాయకులు,శ్రేణులు పాల్గొన్నారు.