24 July, 2026 | 4:08 AM

పారమితలో తొలి ఏకాదశి వేడుకలు

24-07-2026 12:40 AM

ముకరంపుర, జూలై 23 (విజయ క్రాంతి): నగరంలోని పారమిత వరల్ స్కూల్లో గురువారం నమూనా ఎన్నికలు, తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నికల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, క్రీడా విభాగం, క్రమశిక్షణ విభాగం, అసెంబ్లీ, సాంస్కృతిక విభాగాలకు నాయకులను ఇ-బ్యాలెట్, పేపర్ బ్యాలెట్ విధానంలో విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఎన్నుకున్నారు. తొలి ఏకాదశి వేడుకలు పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.

ఈ సందర్భంగా పారమిత పాఠశాలల ఛైర్మన్ డాక్టర్ ఇ ప్రసాదరావు మాట్లాడుతూ నమూనా ఎన్నికల కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ప్రజాస్వామ్య అవగాహన, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందుతాయని, తొలి ఏకాదశి వేడుకల ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం, ఆధ్యాత్మిక విలువలు బలపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, వియుయం ప్రసాద్, ప్రిన్సిపాల్ ఎం శ్రీకర్, సమన్వయకర్త దీప్తి రాణి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు స్వామి, అలోక్, ఇంట్రా మ్యూరల్ కమిటీ సభ్యుడు కె శ్రీనివాస్, పిఈటీలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.