24 July, 2026 | 1:59 AM

ప్రజా సమస్యలు వినకుండా ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తారా?

24-07-2026 12:43 AM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్

చొప్పదండి, జూలై 23 (విజయ క్రాంతి): కేంద్రంలోని బిజెపి సర్కార్ ప్రజా సమస్య లను వినడం మానేసి, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడమే పనిగా పెట్టుకుందని కాంగ్రెస్ పార్టీ గంగాధర మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్ అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ శ్రేణుల అరెస్టు, నీట్ పేపర్ లీకేజీకి నీరసనగా ఏఐసీసీ పిలుపుమేరకు గురువారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా లో గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహేందర్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

భవిష్యత్ లో  బిజెపి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశ భవిష్యత్తు,విద్యా వవస్థ బాగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చన్న, మాజీ జెడ్పిటిసి గునుకొండ బాబు, మహిళా కాంగ్రెస్ నాయకురాల్లు చిరుత మంగ, తోట సంధ్య, సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు ముద్దం నగేష్, సర్పంచ్ లు వేముల భాస్కర్, రేండ్ల శ్రీనివాస్, దాసరి శంకరయ్య, బీర్ల ఆనంద్, లింగాల లింగయ్య, బారాజు ప్రభాకర్ రెడ్డి, బాసవేని శ్రీనివాస్, పాల్గొన్నారు.