మెనూ ప్రకారం ఆహారం కోసం విద్యార్థుల ఆందోళన
బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని బీసీ కళాశాల విద్యార్థులు తహసిల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు. ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహానికి చెందిన విద్యార్థులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం(Sub-Collector's Office) చేరుకుని ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి విద్యార్థులు తహసిల్దార్ ఆఫీసు కు చేరుకొని ధర్నా చేశారు.
వసతి గృహంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. వెంటనే మెనూ సక్రమంగా అమలు చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రజావాణి లో విద్యార్థి సంఘాల ప్రతినిధులు అధికారుల కు వినతి పత్రం అందచేశారు. అధికారులు అక్రమంగా మెనూ అమలుకు చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు.






