27 July, 2026 | 3:23 PM

విద్యార్థిని ఆత్మహత్యయత్నం

27-07-2026 02:49 PM

పలిమేల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం పాల్పడింది.పలిమెల మండలంలోని పంకెన గ్రామానికి చెందిన పాగే కృష్ణవేణి అనే విద్యార్థిని నీట్ పరీక్షలో ఆశించిన మేరకు మార్కులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.