భీమారంలో విత్తన మేళా
27-07-2026 02:52 PM
భీమారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమారం రైతు వేదికలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి (MAO) అత్తె సుధాకర్ తెలిపారు. ఈ నెల 29 వరకు నిర్వహించే ఈ ఈ 'విత్తన మేళా' (Seed Mela) ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రైతులకు అవసరమైన నాణ్యమైన కందులు, పెసర్లు, కూరగాయలు, ధృవీకరించిన విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను ఒకే చోట అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.






