15 June, 2026 | 10:15 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఇందిరమ్మ గృహాన్ని సందర్శించిన కమిషనర్

30-12-2025 01:48 AM

కరీంనగర్, డిసెంబరు 29 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిదిలో నిర్మాణం పూర్తి చేసుకున్న మొట్ట మొదటి ఇందిరమ్మ గృహాన్ని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సందర్శించారు. సోమవారం అధికారులతో కలిసి 8 డివిజన్ అలుగునూరు లో మొదటి విడుతలో పూర్తున మొట్ట మొదటి ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఇంటి నిర్మాణంను వేగవంతంగా పూర్తి చేసిన లబ్ధిదారుడు అడిచర్ల శ్రీలత సంపత్ దంపతులను కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అభినందించారు.

ఈ సంధర్బంగా కమిషనర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల సాకారం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ పథకంను ప్రవేశపెట్టిందని అన్నా రు. నగరపాలక సంస్థ పరిదిలో ఇప్పటి వరకు కొత్తగా విలీనం చెందిన గ్రామాల డివిజన్లు కలుపుకొని లబ్ధిదారులకు 1400 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఇం దిరమ్మ గృహాలు వివిధ స్థాయిలో నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. అలుగునూరు ప్రాం తంలో మొట్ట మొదటి ఇందిరమ్మ నివాసం పూర్తుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ దిలీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.