12-02-2026 02:48:43 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వార్డు నెంబర్ 18 లిమ్ర గార్డెన్ సమీపం లో గల ప్రైమరీ స్కూల్ లోని పోలింగ్ కేంద్రం నెంబర్ 55 లో, బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు.
ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని నిర్భయంగా ఓటు వేశారన్నారు. ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నట్లు తెలిపారు. అన్ని పోలీస్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ర్యాంప్స్ నిర్మించడమే కాక వీల్ చైర్స్ ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం గుర్తించిన 17 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.