calender_icon.png 12 February, 2026 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని మున్సిపాలిటీలు మావే

12-02-2026 02:47:29 AM

రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం: మంత్రి శ్రీధర్‌బాబు

మంథని/కమాన్‌పూర్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలి టీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం కమాన్‌పూర్ క్రాస్ రోడ్డు వద్ద మంత్రి పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడా రు. సర్పంచు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజ లు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. ఉమ్మ డి కరీంనగర్ జిల్లాలో రామగుండం, కరీంనగర్ కార్పొరేషన్లను కాంగ్రెస్ గెలుస్తున్నదని ధీమా వ్యక్తం చేశారు.

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్, మంథని, పెద్దపల్లి అలాగే కరీంనగర్ జిల్లాలోని మొత్తం మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. రేవంత్‌రెడ్డి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. అన్ని స్థానాల్లో స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజ లు ఆనందంగా ఉన్నారని, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం అయిందన్నా రు. ఇచ్చిన వాగ్దానాల్లో ఉచిత బస్సు, ఉచిత విద్యుత్తు, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయడం జరుగుతుందని, నేడు తెలంగాణలోని ప్రతి ఒక్కరి కళ్ళలో కాంగ్రెస్ పాలనలో ఆనందం వెల్లివిరుస్తోందని స్పష్టం చేశారు.