6 April, 2026 | 3:27 AM

ప్రభుత్వ భవనాల్లో సీఎం ఫొటో ఉండాల్సిందే

06-04-2026 12:04 AM

అదే లక్ష్యంతో క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫొటో బిగించాం

క్యాంపు కార్యాలయం కేసిఆర్ సొంత ఆస్తి కాదు

సిద్దిపేట డిసిసి అధ్యక్షులు తూంకుంట అక్షారెడ్డి

గజ్వేల్, ఏప్రిల్5: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ జీవో ప్రకారం సీఎం ఫో టో ఉండాలన్న  లక్ష్యంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో బిగించినట్లు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూoకుంట అంక్షారెడ్డి తెలిపారు. గజ్వేల్ లోని ఆమె నివాసంలో విలేకరుల సమావేశంలో అంక్ష రెడ్డి మాట్లాడారు.  క్యాంపు కా ర్యాలయం కేసిఆర్ సొంత ఆస్తి కాదని, ప్రభుత్వ నిధులతోనే ఆ భవనం నిర్మించినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ క్యాంపు కా ర్యాలయాన్ని బిఆర్‌ఎస్ భవన్ గా, సొంత ఆస్తి లాగా, వ్యక్తిగత పనులకు వాడుకుంటున్నట్లు ఆరోపించారు.

శాంతియుతంగా, గొడవలకు అవకాశం లేకుండా, గాందేయ మార్గంలో రేవంత్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే కెసిఆర్ చిత్రప టానికి ఎలాంటి నష్టం చేయకుండా, ఆయన ఫోటోకు ఎదురుగా సీఎం ఫోటో బిగించినట్లు పేర్కొన్నారు.  కాగా ప్రజా పాలనలో భాగంగా 5వ వార్డులో కేసీఆర్ ఫోటో లేదని, సీఎం ఫ్లెక్సీని అధికారుల సమక్షంలోనే మున్సిపల్ చైర్మన్ తొలగించగా, దా నిని దృష్టిలో పెట్టుకొని తాము రేవంత్ రెడ్డి పెట్టినట్లు చెప్పారు. బిఆర్‌ఎస్ నేతలు ప్రోటోకాల్ అంశాన్ని తెరపైకి తెచ్చినందున తాము స్పందించాల్సి వచ్చిందన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండని, సమస్యలు పరిష్కరించని, ప్రభుత్వ సొమ్ము వేతనంగా పొందు తున్న ఎమ్మెల్యే కేసీఆర్ ను తొలగించాలని కోరుతూ సిద్దిపేట నుండి గవర్నర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి వినతి పత్రం అందజేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. క్యాంపు వద్ద తాము ఎలాంటి దాడులు, దౌర్జన్యం, ధ్వంసం చేయలేదని, అది తమ అభిమతం కూడా కాదని తెలిపారు. కొం దరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తుండగా, వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. క్యాంపు ఆఫీసు నిర్మించి ఏడేండ్లు దాటుతున్నప్పటికీ కెసిఆర్ అడుగు పెట్టిన దాఖలాలు లేవన్నారు. ఆయన ఇప్పటికైనా తన ఆఫీసుకు వచ్చి సమస్యలు పరిష్కరించాలనే వెళ్లినట్లు తెలిపారు.

గతంలో సైతం ఎ ర్రవల్లి ఫామ్ హౌజ్ వద్దకు వెళ్లి వినతి పత్రం అందించే ప్రయత్నం చేయగా, కెసిఆర్ అం దుబాటులోకి రాలేదన్నారు. ఆయన గజ్వేల్ అభివృద్ధి కోసం క్యాంపు కార్యాలయానికి వస్తే సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని, నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మాజీ సీఎంగా కెసిఆర్ కు తప్పకుండా గౌరవిస్తామని ఆంక్షా రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు మొనగారి రాజు, కౌన్సిలర్లు, నేతలు నర్సింహారెడ్డి లక్ష్మీ శ్రీనివాస్, సంతోష రాములు గౌడ్, సారిక శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి అస్గర్ పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని... దూషించిన ప్రతాప్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

కెసిఆర్ క్యాంపు కార్యాలయంలో తాము ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని తొలగిస్తూ ప్రతాప్ రెడ్డి వైరల్ చేయ డాన్ని నిరసిస్తూ గజ్వేల్, కొండపాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ఆదివారం గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పట్ల అగౌరవంగా మాట్లాడడం తో పాటు ఆయన చిత్రపటాన్ని అగౌరవ పరుస్తూ విసిరే ప్రయత్నం చేయగా, ఆయన ఏ హోదాలో తొలగించారని నిలదీశారు.

ఎ మ్మెల్యే గా పోటీ చేసి మూడుసార్లు ఓటమి చెంది కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి, డిసిసి అధ్యక్షులు తూoకుంట అం క్షారెడ్డి లక్ష్యంగా విమర్శలు చేస్తున్న ఆయన అవినీతి, అక్రమాలను త్వరలోనే బహిర్గతం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అభియాన్ చైర్మన్ నర్సింహ రెడ్డి, మం డల కాంగ్రెస్ అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి, ర వీందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, మాజీ కోఆప్షన్ షరీ ఫ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు మొనగారి రాజు, కౌన్సిలర్లు,కోడకండ్ల బాలు తదితరులు పాల్గొన్నారు.