6 April, 2026 | 5:12 AM

అడవిశ్రీరాంపూర్‌లో ఎల్లమ్మ గుడి వద్ద నూతన బోరు

06-04-2026 03:26 AM

రాజయ్యకు కృతజ్ఞతలు తెలిపిన గౌడ కులస్తులు 

ముత్తారం, ఏప్రిల్ 5 (విజయ క్రాంతి) మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గౌడ్ కుటుంబాలకు ఆరాధ్య దైవం అయిన ఎల్లమ్మ గుడికి నీటి సమస్య తెలుసుకొని రూ. 70 వేలతో తన స్వంత ఖర్చులతో ఏఎంసీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య-వెంకటలక్ష్మి బోరు వేయించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ గౌడ కులస్తులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ల సహకారంతో బోరు వేయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బోర్ వేయించిన రాజయ్యను గ్రామంలోని గౌడ సంఘం నాయకులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం, ముత్తరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు వాజిద్ పాషా, యువజన మండల అధ్యక్షులు బక్కతట్ల వినీత్ తో పాటు అడవిశ్రీరాంపూర్ గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.