13 March, 2026 | 1:57 AM

ప్రజా పాలన ప్రణాళికలో ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేయాలి

12-03-2026 12:51 AM

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల, మార్చి 11 (విజయ క్రాంతి): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో ముఖ్యమంత్రి  ఆదేశాలను అధికారులు తూచ తప్పకుండా పాటించాలని రాష్ట్ర సాం ఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్ లో జరిగిన మున్సిపల్ చైర్మన్లు వార్డు కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులకు ప్రజాపాలన - ప్రగతి ప్ర ణాళిక అవగాహన,

శిక్షణ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ముఖ్య అ తిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి ప్రభుత్వం తీసుకున్న 99 రోజుల ప్ర ణాళికలో ప్రతి ఒక్కరు తమ బాధ్యత గుర్తించుకొని 10 అంశాలపై ప్రత్యేక దృష్టి సారిం చాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా పెండింగ్ ఫైళ్ళు క్లియరెన్స్ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈవిషయంలో జిల్లా కలెక్టర్ ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని సూచించారు. 

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు బాధ్యత మెలగాలని ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు నిధుల కోరత లేకుండా చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కోరినట్లు మంత్రి తెలిపారు. ఈసారి పుష్కరాలకు ప్రభుత్వం ముందుగానే పనులు పూర్తి అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుందని మంత్రి వివరించారు.

ఈకార్యక్రమంలో జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మెట్ పల్లి మున్సిపాలిటీ చైర్మన్ లింబాద్రి,  కోరుట్ల మున్సిప ల్ చైర్మన్ వసంత, రాయికల్ మున్సిపల్ చైర్మన్,  కలెక్టర్ సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.