‘శాతవాహన’లో విద్యా సాధికారతపై సదస్సు
ముకరంపుర, మార్చి 11(విజయ క్రాంతి) శాతవాహన విశ్వవిద్యాలయంలో ఆరట్స్ క ళాశాల సెమినార్ హాల్లో విద్యా సాధికాకారత వంద రోజుల ప్రణాళికపై సదస్సు రిజి స్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వి చ్చేసిన డాక్టర్ యోగితా రానా ప్రిన్సిపల్ సె క్రెటరీ మాట్లాడుతూ విద్యను నైపుణ్యాలను వేరుగా చూడొద్దని వాటిని కలిపి విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని పేర్కొం టూ నైపుణ్యాల కొరకు ఉపాధ్యాయులు అ వసరమైతే ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని ఈ వందరోజుల విద్య ప్రణాళికలో భాగంగా వి ద్యాసంస్థలు తమ అక్రిడేషన్లను పెంచుకోవాలని పరిశోధనలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఉన్నత విద్యా కమిషనర్ దేవసేన మాట్లాడుతూ విద్య ఒక సమున్నతమైన అవకాశాల ను విద్యార్థులకు అందించడానికి ఉందని అది విద్యార్థికి జీవితాంతం ఉపయోగపడాలని, ఆ విద్యతో రాష్ట్ర ప్రగతిలో దేశ ప్రగ తిలో భాగం కావాలని, అది నాణ్యమైన వి ద్యతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.విశిష్ట అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని కళాశాలలో నైపుణ్యాల కొరకు ఈ వందరోజుల ప్రణాళిక ఎంతో ఉపయోగపడు తుందని,
ఉపాధి అవకాశాలు కలిగిన కోర్సులలో కొన్ని ప్రత్యేక సదస్సుల ద్వారా విద్యార్థులను మేధస్సును బలోపేతం చేయడానికి ఈ ప్రణాళిక ఊతం ఇస్తుందని అన్నారు.మరొక ప్రత్యేక అతిధిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ విద్యారంగంలో విశిష్ట పరిశోధనల కొరకు విశ్వవిద్యాలయాలు తమ కళాశాలలతో భాగస్వామ్యం పెంచుకొని విద్యార్థుల భవిష్యత్తు కొరకు బాటలు వేయడం వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అవకాశాలు అందించడంలో విశ్వవిద్యాలయాలు ముందుండాలన్నారు.
రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యా సాధికారత కొరకు డిగ్రీ కళాశాలలతో విద్యా సంబంధమైన ఒప్పందాలు కుదుర్చుకొని ఈ వంద రోజుల ప్రణాళికలో విద్యార్థులను అత్యుత్తమతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తామని తెలియజేశారు.
ఈ సందర్భంగా రెండు సాంకేతిక సంస్థలతో విద్యా సంబంధమైన ఒప్పందాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాక్కడే, ఇతర జిల్లా అధికారులు, విశ్వవిద్యాలయ ఐక్యూఏసి డైరెక్టర్ డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ మౌలానా ఉర్దూ విశ్వవిద్యాలయం నుండి ఆచార్య రమాదేవి, విశ్వవిద్యాలయ విభాగాధిపతులు, విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




