12 March, 2026 | 10:52 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

పెట్టుబడుల పేరుతో మోసం

12-03-2026 12:52 AM

25 మంది నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు 

మహిళ అరెస్ట్ 

ఎల్బీనగర్, మార్చి 11 : పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఇస్తానని నమ్మబలికి పలువురిని మోసం చేసిన మహిళను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన వివరాల ప్రకారం   సికింద్రాబాద్ బోయగూడ కి చెందిన సాగు కవిత (44) అనే మహిళ 2025 సంవత్సరంలో నాగోల్ డివిజన్ పరిధిలోని మమతా నగర్, రోడ్ నెంబర్2లో విజన్ ఇన్ఫ్రా పేరిట రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది.

అనంతరం ప్రజలను ఆకర్షించే విధంగా పెట్టుబడి పథకాన్ని ప్రకటించింది. ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 100 రోజులలో అసలు లక్ష రూపాయలతో పాటు రూ.80 వేల రూపాయలను వడ్డీగా ఇస్తామని చెప్పి పలువురిని నమ్మించింది. ఆమె మాటలను నమ్మిన నాగోల్ ప్రాంతానికి చెందిన సుమారు 25 మంది పెట్టుబడిదారులు 2 కోట్ల వరకు డబ్బులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బంజారా కాలనీకి చెందిన రామావత్ మ హేందర్, రామావత్ ఠాగూర్ నాయక్, రామావత్ కుమార్, సంధ్యారాణి, కేతావత్ నాగేష్‌లు పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నారు.

పెట్టుబడిదారులను మరింత న మ్మబలికేందుకు దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో ఐదు గుంటల భూమిని సెక్యూరిటీగా వారి పేర్లపై రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా పోలీసులు వెల్లడిం చారు. అయితే 100 రోజుల గడువు దాటి నా వడ్డీ ఇవ్వకపోవడంతో పాటు పెట్టి న అసలు డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో తాము మోసపోయామని గ్రహిం చిన బాధితులు పోలీసులను ఆశ్రయించా రు. బాధితులు సంధ్య, బాబు నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి   నిందితురాలిని ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.