14 May, 2026 | 4:47 AM

జనగణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

14-05-2026 02:37 AM

జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, మే 13 (విజయక్రాంతి) : జిల్లాలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియను పకడ్బందీగా, ఎలాంటి తప్పులు దొర్లకుండా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని శాంతినగర్, బొక్కలగూడ ప్రాంతాల్లోచేపట్టిన సర్వేను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న జనగణన సర్వేను పరిశీలించారు.

క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు నమోదు చేస్తున్న సెన్సస్ నంబర్లు, వారు సిద్ధం చేసిన లేఅవుట్ మ్యాపులను కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. సర్వే నమోదు ప్రక్రియ క్రమపద్ధతిలో సాగుతుండటంపై సంతృప్తి వ్యక్తం సిబ్బంది పనితీరును అభినందించారు. రేపటి నుండి హెచ్‌ఎల్‌ఓ యాప్ ద్వారా డేటా నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, సాంకేతిక అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజలందరూ జనగణన-2027 లో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీలో మాస్టర్ ట్రైనర్ శ్రీహరి బాబు, ఫీల్ ట్రైనర్ సుజాత్ ఖాన్, మున్సిపల్ సిబ్బంది సాయి కృష్ణ, నవీన్ కుమార్, సంబంధిత సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.