15 June, 2026 | 6:12 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

దేశాభివృద్ధికి జనగణన అత్యంత కీలకం

17-03-2026 01:12 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, మార్చి ౧౬ (విజయక్రాంతి): దేశాభివృద్ధికి జనగణన అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు. భారత జనాభా గణన - 2027 కి సంబంధించి, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో జనగణన ప్రక్రియ కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. జనగణన ప్రక్రియకు సం బంధించి, గృహాల గుర్తింపు, జనగణన వివరాల నమోదులో తప్పులకు తావు ఉండ కూడదని పేర్కొన్నారు. మాస్టర్ ట్రైనర్లు అం దించే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీఓ జీవరత్నం, డిపివో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్,ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.